భారతదేశం, డిసెంబర్ 6 -- బిగ్ బాస్ 9 తెలుగు తుది ఘట్టానికి చేరువైంది. మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పూర్తి కానుంది. ఈ వారం టికెట్ టు ఫినాలే పొంది కల్యాణ్ పడాల ఫైనల్స్‌కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దాంతో టికెట్ టు ఫినాలే గెలుచుకునేందుకు మిగతా కంటెస్టెంట్స్ మధ్య పోటీ నెలకొంది.

ఇక ఈ వీకెండ్‌తో బిగ్ బాస్ తెలుగు 9 పదమూడో వారం కూడా పూర్తి కానుంది. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్‌కు ఛాన్స్ ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ వారం ఎలిమినేషన్‌కు డేంజర్‌లో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు 13వ వారం ఆరుగురు నామినేషన్స్‌లోకి వచ్చారు. తనూజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో మొదటి ...