భారతదేశం, నవంబర్ 22 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారంలో ఫ్యామిలీ వీక్ నడిచింది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన తల్లిదండ్రులు, ఇతర బంధువులు ఇలా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌజ్‌మేట్స్ అంతా బావోద్వేగానికి లోనయ్యారు.

ఇక వీకెండ్ రానే వచ్చేసింది. ఈ వారం కూడా బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్ దూసుకుపోవడం విశేషంగా మారింది. ఈ సీజన్‌లో ఎక్కువగా నామినేషన్స్‌లోకి రాని ఇమ్మాన్యూయెల్ పదకొండో వారం నామినేట్ అయ్యాడు.

ఎక్కువగా నామినేషన్స్‌లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండరనేది బీబీ హిస్టరీ. అయితే ఆ హిస్టరీని బ్రేక్ చేస్తూ నామినేషన్స్‌లోకి చాలా కాలం తర్వాత వచ్చి కూడా అదిరిపోయే ఓటింగ్ సంపాదించుకుంటున్నాడు ఇమ్మాన్యూయెల్. ఇకపోత...