భారతదేశం, డిసెంబర్ 20 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరు? రూ.50 లక్షలు దక్కించుకునేదెవరు? సూట్ కేస్ తో బయటకు వెళ్లేదెవరు?.. ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకబోతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనల్ రేపే. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో తేలిపోతుంది. అయితే బిగ్ బాస్ 9 ఫైనల్ ఓటింగ్ లో ఫేక్ ఓట్ల కారణంగా రిజల్ట్ తారుమారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

బిగ్ బాస్ 9 తెలుగు మరో రోజులో ఎండ్ కానుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే జనాలు తాము గెలవాలని కోరుకున్న కంటెస్టెంట్లకు ఓట్లు వేసేశారు. ఇక రిజల్ట్ రావడమే మిగిలింది. అయితే ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో వచ్చిన ఓట్ల ప్రకారం ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ ట్రోఫీ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

బిగ్ బాస్ 9 ఓ...