Hyderabad, సెప్టెంబర్ 18 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఒక్కో కంటెస్టెంట్ అరుపులు, గొడవలతో మంచి కంటెంట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్స్ కూడా జోరుగా సాగాయి. బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

అయితే, నామినేషన్స్ ప్రక్రియ ప్రకారం ముందుగా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్ నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. వారిలో భరణి శంకర్, హరిత హరీష్, ఫ్లోరా సైని, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, డీమోన్ పవన్ ఉన్నారు. వీరిలో భరణి, హరిత హరీష్‌కు అత్యధికంగా చెరో ఆరు నామినేషన్స్ పడ్డాయి.

అయితే, నామినేషన్స్ తర్వాత కెప్టెన్ అయిన సంజనకు బిగ్ బాస్ ఓ సూపర్ పవర్ ఇచ్చారు. నామినేట్ కాని వారిలో హౌజ్ నుంచి బయటకు వెళ్లేందుకు అర్హులు అనిపించిన వారిని ఒకరిని సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ ...