భారతదేశం, జూలై 5 -- మరోసారి తెలుగు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రెడీ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి టైమ్ ఆసన్నమవుతోంది. ఈ సీజన్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 9 త్వరలోనే వస్తుందంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లోకి కామన్ వ్యక్తులకు కూడా ఎంట్రీ ఉందని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. మరోసారి కింగ్ నాగార్జున ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ ఎక్స్ లో వరుసగా పోస్టులు పెట్టింది. ''ఇంకా వెయిటింగ్ ఎందుకు? వీడియో రికార్డు చేయండి. ఇప్పుడే అప్లై చేయండి. త్వరలోనే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది'' అని పోస్టు చేసింది.

బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ క...