భారతదేశం, డిసెంబర్ 21 -- బుల్లితెర ప్రేక్షకులను గత 105 రోజులుగా అలరించిన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ సంచలన ముగింపు దిశగా సాగుతోంది. ఇవాళ ఆదివారం (డిసెంబర్ 2) రాత్రి జరుగుతున్న గ్రాండ్ ఫినాలేలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా, మాస్ ఆడియెన్స్‌లో బలమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న డీమాన్ పవన్, విన్నర్ రేసు నుంచి తప్పుకుంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే, డిమాన్ ఉత్త చేతులతో కాకుండా.. ఏకంగా రూ. 15 లక్షల నగదు ఉన్న సూట్‌కేస్‌ను ఎంచుకుని స్మార్ట్ డీల్ చేసుకున్నాడు.

ప్రతీ సీజన్‌లోనూ ఫైనలిస్టులకు నగదు ఆఫర్ చేయడం రివాజే. గతంలో సోహెల్ వంటి వారు ఇలాగే నగదు తీసుకుని బయటకు వచ్చి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆ అవకాశం డీమాన్ పవన్‌కు దక్కింది.

బిగ్ బాస్ 9 తెలుగు ఫైనల్ రేసులో కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామిల మధ్య గట్టి పోటీ ఉండటంతో రిస్క్ తీసు...