భారతదేశం, డిసెంబర్ 2 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై ఆట మరో లెక్క! ముగింపు దిశగా సాగుతున్న ఈ సీజన్ లో అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఫినాలే రేసు వచ్చేసింది. టాప్-5లో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్ల మధ్య సమరం ప్రారంభమైంది. ఈ వారం ఇవే టాస్క్ లతో హౌస్ రణరంగంగా మారబోతుంది.

బిగ్ బాస్ 9 తెలుగులో ఇప్పుడు 13వ వారం. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్లలో నుంచి అయిదుగురు టాప్-5కు వెళ్తారు. ఫైనల్ చేరతారు. ఆ అయిదుగురు ఎవరో నిర్ణయించే పోరు ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ మధ్య పోరు మరో స్థాయికి చేరింది.

రేస్ టు ఫినాలేను బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అయిదే ముందుగా ఫస్ట్ రౌండ్ లో పోటీపడే ముగ్గురు కంటెస్టెంట్ల పేర్లను చెప్పమన్నాడు బిగ్ బాస్. ఫస్ట్ పవన్, కల్యాణ్, ఇమ్మా...