Hyderabad, అక్టోబర్ 5 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వారం పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 15 మంది కంటెస్టెంట్స్‌తో లాంచ్ కాగా వారిలో ఇప్పటికీ ముగ్గురు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో మొదటి వారం శ్రేష్టి వర్మ, సెకండ్ వీక్ మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో 12 మంది హౌజ్‌లో మిగిలారు. ప్రియా ఎలిమినేట్ కాకముందే రాయల్ కార్డ్ ఎంట్రీగా దివ్య నిఖితా ఎంట్రీ ఇచ్చింది. దాంతో ప్రియా ఎలిమినేషన్ అనంతరం హౌజ్‌లో 13 మంది మిగిలారు.

ఈ 13 మందికి బిగ్ బాస్ తెలుగు 9 నాలుగో వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం దివ్య నిఖితా, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని ఆరుగురు నామినేట్ అయ్య...