భారతదేశం, డిసెంబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ ఎండింగ్ కు చేరుకుంది. మరో వారం ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో అయిదుగురు మాత్రమే ఫినాలేలో ఉంటారు. ఈ నేపథ్యంలో మిగతా ఇద్దరు ఎలిమినేట్ అవాల్సిందే. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి ఇవాళ ఎలిమినేట్ అవుతారన్నది కన్ఫామ్ అని తెలిసింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి జర్నీ ముగిసింది. అతను ఈ రోజు (డిసెంబర్ 13) ఎలిమినేట్ అవుతున్నాడు. ఫినాలేకు ముందు వీకెండ్ లో హౌస్ వదిలి వెళ్లిపోతున్నాడు. బిగ్ బాస్ ఈ సీజన్ ముఖ్యమైన ఫినాలేకు దగ్గర కావడంతో సుమన్ శెట్టి ఎలిమినేట్ తప్పలేదని తెలిసింది. మరోవైపు ఓటింగ్ లో కూడా అతను లాస్ట్ లో ఉన్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ...