భారతదేశం, నవంబర్ 9 -- బిగ్ బాస్ 9 తెలుగులో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. బిగ్ బాస్ అన్నాక ఇలా అనుకోని ట్విస్టులు, అరుపులు, గొడవలు సర్వసాధారణమే. ఎలిమినేషన్‌లో ప్రతి రెండు మూడు వారాలకు ఏదో ఒక ట్విస్ట్ ఉంటూనే ఉంటుంది. అది కొన్ని సార్లు డబుల్ ఎలిమినేషన్ అయితే.. మరికొన్ని సార్లు సెల్ఫ్ ఎవిక్ట్ అవుతుంది.

అదే ఈ వారం జరిగింది. ఓటింగ్ బాగున్నా కూడా స్వయంగా ఎలిమినేట్ అయి కంటెస్టెంట్స్ వెళ్లిపోతుంటారు. గత బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నాగ మణికంఠ సొంతంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.

బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 8 నాటి ఎపిసోడ్‌లో వీకెండ్‌లో భాగంగా హోస్ట్ నాగార్జున వచ్చాడు. వారం అంతా డల్‌గా ఉన్న రామును ఏమైందని, ఎలా ఉన్నావని నాగార్జున అడిగాడు. కుటుంబం గుర్తుకు...