Hyderabad, సెప్టెంబర్ 25 -- బిగ్ బాస్ అంటేనే అరుపులు, కేకలు, గొడవలు. ఇదే తెలుగు ఆడియెన్స్ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్. దానికి తగినట్లుగా ఇవాళ్టీ బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై కోపాన్ని మరొకరిపై కంటెస్టెంట్స్ చూపిస్తూ సెప్టెంబర్ 25 బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు ఉంది.

బిగ్ బాస్ హౌజ్‌లో సంజనకు టీ తీసుకొచ్చి ఇచ్చాడు సింగర్ రాము. అందులో షుగర్ లేదని సంజన అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. "సంజన గారు ఉదయం టీ తాగారా" అని సంజనను సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అడిగింది. దానికి "అవును" అని సంజన చెప్పింది. మరి అదేంటీ అని మరో టీ కప్ చూపించింది తనూజ.

"సంజన గారు ప్లీజ్ మీరు ఏమైన అన్నప్పుడు, మాట్లాడినప్పుడు క్లారిటీగా ఉండండి. ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి ఏంటీ అని అనకండి" అని తనూజ అంది. "ఒక్క నిమిషం ఫ్లోరా విషయంలోకి...