Hyderabad, సెప్టెంబర్ 8 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ జరిగింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో మొత్తంగా 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు.

వీరిలో కామనర్స్ లగ్జరీ రూమ్స్‌లలో ఓనర్స్‌గా ఉంటే సెలబ్రిటీలు మాత్రం రెంట్ లేకుండా టెనెంట్స్‌లా సాధారణ గదుల్లో ఉండాలని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఇక బిగ్ బాస్ తెలుగు 9 మొదటి రోజే హౌజ్‌లో రచ్చ మొదలైంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 8 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.

బిగ్ బాస్ ప్రోమోలో ఉదయం పూట హౌజ్‌మేట్స్‌లో జోష్ నింపడానికి డ్యాన్సర్స్ వచ్చి ఎంకరేజ్ చేశారు. వాళ్లతో కంటెస్టెంట్స్ అంతా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం హాల్లో బిగ్ బాస్ హాయ్ చె...