Hyderabad, జూలై 2 -- టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడీ కన్నడ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ తోనూ సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని బుధవారం (జులై 2) ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కన్ఫమ్ చేశాడు.

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రావణం అనే మూవీ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని దిల్ రాజు కూడా ధృవీకరించాడు. తమ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

తమ్ముడు మూవీ ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలకు ఎక్కడానికి కొంత సమయం పడుతుందని, అయితే ఇది కచ్చితంగా ఉంటుందని మాత్రం దిల్ రాజు తేల్చి చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు....