భారతదేశం, జూన్ 27 -- బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. అన్ని రకాల ఎమోషన్స్ ను బయటకు తీసే గేమ్ ప్లేకు టైమ్ ఆసన్నమవుతోంది. సెలబ్రిటీలతో బిగ్ బాస్ ఆడించే ఆట మళ్లీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. కొత్త సీజన్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు స్టార్ మా క్లారిటీనిచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది.

బిగ్ బాస్ సీజన్ 9 కమింగ్ సూన్ అంటూ స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో హాస్ట్ నాగార్జున ఎంట్రీ వేరే లెవల్ లో ఉంది. ఆయన స్వాగ్, స్టైల్ అదిరిపోయింది. ''ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే'' అని ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ విజిల్స్ కొట...