భారతదేశం, జూలై 2 -- బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టించిన సోలో బాయ్ మూవీ జూలై 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. న‌వీన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ కీల‌క పాత్ర‌లు పోషించారు. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ... "సోలో బాయ్‌ నిర్మాత సతీష్ ఒక డైరెక్ట‌ర్‌గా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపప‌డ్డారు. హీరోగా గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలి" అని అన్నారు.

దర్శకుడు నవీన్ కు...