భారతదేశం, మే 14 -- బిగ్‌బాస్ సీజ‌న్ 8 త‌ర్వాత మ‌రోసారి ఓ ఓటీటీలో షోలో క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు ప్రేర‌ణ, య‌ష్మి. ఆహా ఓటీటీలో కాక‌మ్మ క‌థ‌లు పేరుతో ఓ టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకు తేజ‌స్వి మ‌దివాడ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. కాక‌మ్మ క‌థ‌లు సీజ‌న్ 2 నాలుగో ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ ప్రేర‌ణ కంభం, య‌ష్మి గౌడ గెస్ట్‌లుగా రాబోతున్నారు.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవ‌ల ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో ఈ ప్రోమో వైర‌ల్ అవుతోంది. ఈ ప్రోమోలో ఒక‌రిపై మ‌రొక‌రు పోటీప‌డి పంచ్‌లు వేస్తూ ప్రేర‌ణ‌, య‌ష్మి న‌వ్వించారు.

వ‌ర‌ల్డ్స్‌లో ఉన్న బ్రాండ్స్‌ను కాపీ చేస్తుంది చైనా. కానీ కాపీ చేయ‌లేని ఒక బ్రాండ్ ఉంది త‌నే ప్రేర‌ణ అంటూ తేజ‌స్వి ఎలివేష‌న్లు ఇవ్వ‌డం ఈ ప్రోమోలో ఆక‌ట్టుకుంటుంది. నైటీతో ఈ షోలోకి ప్రేర‌ణ ఎంట్రీ ఇచ్చిన...