భారతదేశం, నవంబర్ 18 -- బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్లు పండాలన్నా, హౌస్ మేట్స్ మరింత బలం రావాలన్నా ఫ్యామిలీ వీక్ రావాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఆ టైమ్ వచ్చేసింది. ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ ఈ వారమే. ముందుగా హౌస్ లోకి తనూజ అక్క కూతురు, చెల్లి వచ్చారు. హౌస్ అంతా ఫుల్ ఎమోషనల్ గా మారిపోయింది.

ఫ్యామిలీ వీక్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ వారం రానే వచ్చింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 11వ వారం ఫ్యామిలీ వీక్. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంటర్స్ రానున్నారు. ముందుగా కెప్టెన్ తనూజ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఈ వారం ఫ్యామిలీ వీక్ లో ముందుగా తనూజకు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. తనూజ కన్ఫెషన్ రూమ్ కు వెళ్లగానే అక్కడ ఆమె అక్క పూజ కూతురు ఉంటుంది. ఆమెన...