భారతదేశం, సెప్టెంబర్ 1 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 7న ఈ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే సామాన్య ప్రజల నుంచి అయిదుగురిని హౌస్ కు ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై మాజీ కంటెస్టెంట్ కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ తో తన కెరీర్ కు ఎలాంటి యూజ్ లేదని ఆమె పేర్కొంది.

తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బిగ్‌ బాస్‌పై కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ''బిగ్‌ బాస్‌‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న చాలా మందికి తెలుగు స్మాల్ స్క్రీన్ పై అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నన్ను మాత్రం దూరం పెట్టారు. బుల్లితెరపై అవకాశాలు రావాలంటే గ్లామర్ షో చేయాలని, పొట్టి బట్టలు వేసుకోవాలని చెప్పేవారు. దానికి నో చెప్పడంతోనే ఏ షోకు కూడా అవకాశం ...