భారతదేశం, జనవరి 22 -- పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలుగా నిర్మించిన సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం నిలవే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా నిలవే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా 2026 ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే సినిమా భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇలాంటి లవ్ డ్రామా చిత్రంలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించారు.

వీరు మాత్రమే కాకుండా హర్ష చెముడు, సుప్...