Hyderabad, మే 26 -- టెక్నాలజీ పెరిగుతున్న కొద్దీ కొత్తగా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో కొన్నేళ్లుగా ఎక్కువ మందిలో ఆందోళన కలిగిస్తున్న విషయం సంతానం లేకపోవడం. దీనికి చాలా కారణాలున్నాయి. మనం తినే ఆహారం, జీవనశైలి, చేసే పని ఇవన్నీ సంతాన సమస్యలకు దారితీయచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయం ఏంటంటే.. ఇందులో బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం కూడా గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందట. ఇది నిజమేనా, టైట్ బట్టలు వేసుకోవడం ఫెర్టిలిటీని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

ముఖ్యంగా పురుషులకు బిగుతు బట్టలు వేసుకోవడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. దానివల్ల గర్భం ధరించడం కష్టమవ్వచ్చు. అయితే, ఫకిహ్ IVF (ఇది గర్భధారణకు సహాయపడే ఆధునిక చికిత్సలు అందించే ఒక ప్రముఖ కేంద్రం) చెప్పిన దాని ప్...