భారతదేశం, డిసెంబర్ 24 -- బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తల్లి అయ్యాక తన శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని అంటోంది. 'వార్ 2' (War 2) సినిమాలో ఆమె బికినీలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భధారణ తర్వాత తన శరీరం మారిన తీరు, మాతృత్వం నేర్పిన పాఠాల గురించి కియారా 'వోగ్' ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ఏడాది జులై 15న తల్లిదండ్రులయ్యారు. వీరికి 'సరాయా' (Saraayah) అనే పాప పుట్టింది. పాప పుట్టిన నెలకే అంటే ఆగస్టు 14న కియారా నటించిన భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2' విడుదలైంది. ఇందులో కియారా బికినీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కియారా స్పందించింది.

'వార్ 2'లోని 'ఆవన్ జావన్' పాట...