భారతదేశం, ఆగస్టు 4 -- బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ మల్టీ స్టారర్ మూవీ 'వార్ 2' (War 2) వచ్చేస్తోంది. ఆగస్టు 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో టీమ్ స్పీడ్ పెంచింది. ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇందులో నుంచి హాట్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఇందులో హృతిక్ రోష‌న్‌, కియారా అద్వానీ కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా బికినీలో కియారా అందాలు కుర్రకారును రెచ్చగొడుతున్నాయి.

వార్ 2 నుంచి మేకర్స్ తెలుగులో సాగే 'ఊపిరి ఊయలగా' అనే సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. కియారా అందాలు, హృతిక్ రోష‌న్‌ గ్రేస్, మనసును హత్తుకునేలా చంద్రబోస్ రాసిన సాహిత్యం కలిసి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జులై 31న రిలీజైన ఈ పాటకు ఇప్పటికే 89 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ లవ్ మెలోడీ లిరిక...