భారతదేశం, డిసెంబర్ 17 -- స్టాక్ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, 'బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్' (Blue Cloud Softech Solutions) షేర్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో దుమ్మురేపాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుండి ఏకంగా 7 శాతానికి పైగా ఎగబాకి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి.

ఈ కంపెనీ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. ప్రభుత్వ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అధికారిక భాగస్వామిగా 'బ్లూ క్లౌడ్ సాఫ్టెక్' ఎంపికైంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (5G FWA) సేవలను అందించడంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషించనుంది.

పశ్చిమ భారత విస్తరణ: ఈ ఒప్పందం ద్వారా మహారాష్ట్ర, గోవా రీజియన్‌లలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఈ కంపెనీ అందించనుంది.

ఏఐ ఆధారిత ...