భారతదేశం, నవంబర్ 1 -- ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1, 2 చిత్రాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న థియేటర్లలో ఘనంగా విడుదలైంది. ఒక రోజు ముందు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ చిత్రం.. 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (2017) చిత్రాల రీమాస్టర్డ్ వెర్షన్.

తొలిరోజు థియేటర్లకు వచ్చిన అభిమానులు బాహుబలి ది ఎపిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఫన్నీగా రీక్రియేట్ చేస్తూ థియేటర్లలో హంగామా చేశారు. రమ్యకృష్ణ నటించిన ఫేమస్ సీన్‌లో అభిమానులు తమ పిల్లలను తీసుకువచ్చి పైకి ఎత్తి పట్టుకున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ సీన్‌లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, అమరేంద్ర బాహుబలిని ...