భారతదేశం, అక్టోబర్ 26 -- దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం బాహుబలి. రెండు పార్ట్స్‌గా విడుదలైన ఈ సిరీస్ ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇందులో మొదటి సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా పోలేదు.

2015లో బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కంక్లూజన్‌గా రెండు సినిమాలు చరిత్ర క్రియేట్ చేశాయి. అలాంటి రెండు సినిమాలను కలిపి ఒక్క చిత్రంగా మలిచారు జక్కన్న. ఇది ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ రెండు పార్ట్స్‌ను ఒక్కటిగా బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్‌తో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్.

రీమాస్టర్ చేసిన విజువల్స్, హై క్వాలిటీ సౌండ్ రెండు పార్ట్స్‌లో తొలగించిన సన్నివేశాలతో బాహుబలి ది ఎపిక్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవ...