భారతదేశం, అక్టోబర్ 31 -- ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి'. బాహుబలి రెండు సినిమాలూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చాయి. ఇప్పుడీ మూవీ రీమాస్టర్డ్, రీ-ఎడిటెడ్ వెర్షన్ ఇవాళ (అక్టోబర్ 31) థియేటర్లలో విడుదలైంది. 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదలైన ఈ చిత్రం.. 2015, 2017లో విడుదలైన రెండు భాగాలను కలిపి 3 గంటల 45 నిమిషాల నిడివితో ఉంది.

బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ వెర్షన్ మొదటి కొన్ని షోలు ముగియకముందే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. బాహుబలి ది ఎపిక్ మూవీ ఇండియాలో, విదేశాలలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల పరంగా అద్భుతమైన స్పందనను రాబట్టింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం గురువారం మధ్యాహ్నానికే ఈ చిత్రానికి స్వదేశంలో, విదేశాలలో కలిపి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రోజు ముగిసే సమయానికి ఈ సంఖ్య రూ.6 కోట్లకు ప...