Hyderabad, ఆగస్టు 27 -- బాహుబలి: ది ఎపిక్ తో మరోసారి ప్రపంచాన్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు రాజమౌళి. బాహుబలి రెండు భాగాలను ఒక్కటిగా చేస్తూ అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ ఎంటర్టైన్మెంట్ వీక్లీతో మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

బాహుబలి: ది బిగినింగ్ రిలీజై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ గా తీసుకొస్తున్నారు. దీనిని రాజమౌళే స్వయంగా రీఎడిట్ చేయడం విశేషం. దీనిపై ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించాడు.

"రెండు బాహుబలి సినిమాలను ఎప్పుడూ ఒకే కథలా ఊహించుకున్నాం. కానీ అది ఒకే సినిమాకి సరిపోనంత పెద్ద కథ. అందుకే దాన్ని రెండు పార్ట్‌లుగా చెప్పాం. పదో యానివర్సరీ కోసం ఆడియన్స్ అప్ప...