Hyderabad, జూలై 10 -- భారతీయ సినిమా రూపురేఖలను మార్చిన 'బాహుబలి' మూవీ విడుదలై పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ప్రత్యేక ప్రకటన చేశాడు. ఈ మైలురాయిని పురస్కరించుకుని.. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' రెండు భాగాలను 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు.

'బాహుబలి' విడుదలైన పదేళ్ల తర్వాత రాజమౌళి తన సినిమాను తిరిగి ఎడిట్ చేసి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని తన ఎక్స్ అకౌంట్లో అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఏమన్నాడంటే..

"బాహుబలి.. అనేక ప్రయాణాలకు ఆరంభం. లెక్కలేనన్ని జ్ఞాపకాలు. అంతులేని స్ఫూర్తి. పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక ...