భారతదేశం, నవంబర్ 4 -- ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి: ది ఎపిక్' అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. బాహుబలి 1, 2 చిత్రాలను కలిపి రీమాస్టర్డ్ వర్షన్ గా దీన్ని రీరిలీజ్ చేశారు. ఈ చిత్రం మొదటి వీకెండ్ లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఫస్ట్ సోమవారం నాడు కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం, 'బాహుబలి ది ఎపిక్' మొదటి సోమవారం భారతదేశంలో రూ.1.35 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో మొత్తం దేశీయ వసూళ్లు రూ.25.7 కోట్లకు చేరాయి. ఈ చిత్రం మంచి ఓపెనింగ్‌ను సాధించింది. గురువారం ప్రీమియర్ల ద్వారానే రూ.1.15 కోట్లు, శుక్రవారం రూ.9.65 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో శనివారం రూ.7.25 కోట్లు, ఆదివారం రూ.6.3 కోట్లు వసూలు చేసింది. దీని ఓపెనిం...