Hyderabad, జూలై 11 -- భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' మూవీ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులకు ఒక ప్రత్యేక శుభవార్త చెప్పాడు. 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కంక్లూజన్' (2017) చిత్రాలను కలిపి, 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా ఈ ఏడాది తిరిగి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అతడు చెప్పాడు. అయితే ఈ మూవీ రన్‌టైమ్ 5 గంటల 27 నిమిషాలు అంటూ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో చెప్పడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

రాజమౌళి ప్రకటన తర్వాత, బుక్‌మైషో తన ప్లాట్‌ఫామ్‌లో బాహుబలి: ఎపిక్ మూవీని అక్టోబర్ 31న విడుదల చేయనున్నట్లు లిస్ట్ చేసింది. "బాహుబలి: ది ఎపిక్, రెండు భాగాల కలిపిన సినిమా" అని సాధారణంగానే ఉంది. అయితే, 5 గంటల 27 నిమిషాల రన్‌టైమ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

'...