Telangana, మే 29 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 31 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్‌ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

గతేడాది వరకు తెలంగాణ టెన్త్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో ప్రకటించారు. పాత పద్ధతికి స్వస్తి పలికిన తెలంగాణ సర్కార్. ఈ ఏడాది మార్కులను ప్ర...