భారతదేశం, అక్టోబర్ 11 -- మ్యాడ్ హీరో నార్నే నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ శివాని తల్లూరిని నితిన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కల్యాణంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిరు. తారక్ కు నార్నే నితిన్ బావమరిది అవుతాడన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పెళ్లికి ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యాడు తారక్.

హైదరాబాద్ లో నార్నే నితిన్, లక్ష్మీ శివాని తల్లూరి వివాహం ఘనంగా జరిగింది. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచే జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాహంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. బావమరిది పెళ్లిలో తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి సందడి చేశాడు తారక్. జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలతో ఆప్యాయంగా గడిపిన క్షణాలు, ఆయనలోని తండ్రి ప్రేమను చూసి అభిమానులు మురిసిపోయారు.

ఈ వివాహం అత్యం...