Hyderabad, జూలై 31 -- తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్​ జీ తెలుగు. ఫిక్షన్​, నాన్-ఫిక్షన్​ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో​ వినోదం అందిస్తూనే​ ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

జీ తెలుగు సరిగమప కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ​విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు సరిగమప, 17వ సీజన్ 'సరిగమప లిటిల్​ ఛాంప్స్​​'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

'సరిగమప సీజన్‌ 17​​'​ను ఘనంగా ప్రారంభించేదుకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్​ నిర్వహిస్తూ బాల గాయనీ గాయకులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జీ తెలుగు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది....