Hyderabad, మే 12 -- నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఉంటున్న చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య పావురాలు. ఇవి బాల్కనీల్లో, డాబాల మీద వాలి ఆ చోటును బాగా మురికి చేస్తాయి. వాటి రెక్కల నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల దుర్వాసన వస్తుంది, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. అంతేకాదు కొన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ పావురాలను మన ఇంటి బాల్కనీల దగ్గరకు రాకుండా చేయడం చాలా ముఖ్యం.

చాలామంది వీటిని తరిమికొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ ముళ్లను పెడతారు, పాత సీడీలను వేలాడదీస్తారు. ఇంకొందరైతే మిరపపొడి కూడా చల్లుతారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా పావురాల బెడద నుంచి మీరు తప్పించుకోకపెతే ఈసారి ఈ కొత్త ట్రిక్ ప్రయత్నించండి. అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించండి. ఇది పావురాలను భయపెట్టడానికి చాలా బ...