భారతదేశం, డిసెంబర్ 4 -- భారతీయ సినిమా చరిత్రలో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన మూవీ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' (డీడీఎల్‌జే). ఈ క్లాసిక్ మూవీ విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని మూవీలో లీడ్ రోల్స్ పోషించిన షారుఖ్ ఖాన్, కాజోల్ లండన్‌లో ఒక ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. లండన్‌లోని ప్రసిద్ధ లెస్టర్ స్క్వేర్‌లో ఈ సినిమాలోని తమ ఐకానిక్ పోజ్‌ను ప్రతిబింబించే కాంస్య విగ్రహాన్ని వీరిద్దరూ కలిసి ఆవిష్కరించారు. ఒక భారతీయ సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే తొలిసారి.

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షారుక్, కాజోల్ సందడి చేశారు. నలుపు రంగు సూట్‌లో షారుఖ్ స్టైలిష్‌గా కనిపించగా, నీలి రంగు చీరలో కాజోల్ మెరిసిపోయింది. విగ్రహం పక్కన నిల్చుని వారు ఫోటోలకు పోజులిచ్చారు. బాలీవుడ్ లో వీళ్లది సూపర్ హిట్ జోడీ. ఇద్దరూ కలి...