భారతదేశం, నవంబర్ 11 -- బాలీవుడ్ దిగ్గజ నటుడు, సీనియర్ హీరో ధర్మేంద్ర 89వ వయసులో కన్నుమూశారు. ఇటీవల ఆయన శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ధర్మేంద్ర ఇవాళ తుది శ్వాస విడిచారు.

హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు తెచ్చుకున్నారు. అలాంటి ధర్మేంద్ర అనంతలోకాలకు వెళ్లడం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని దుఃఖసాగరంలోకి నెట్టివేసింది. ధర్మేంద్ర మరణంతో హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంత్రికి లోనైంది.

ఈ సందర్భంగా ధర్మేంద్ర కుటుంబానికి బాలీవుడ్‌తోపాటు ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు సంతాపం తెలియజేస్తున్నారు. నెటిజన్స్, అభిమానులు రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో ...