భారతదేశం, నవంబర్ 2 -- షారుక్ ఖాన్ అదరగొట్టే రీఎంట్రీ ఇచ్చారు. ఆదివారం (నవంబర్ 2) షారుక్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కింగ్' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ లో షారుక్ డార్క్ మోడ్ లో కనిపించారు. ఈ టీజర్ విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

కింగ్ టీజర్ సంచలనంగా మారింది. ఇందులో షారుక్ ఖాన్ సిల్వర్ హెయిర్, నెత్తుటి ముఖంతో విధ్వంసం సృష్టిస్తూ ఒక భయంకరమైన డార్క్ అవతారంలో కనిపించారు. చేతిలో 'కింగ్ ఆఫ్ హార్ట్స్' కార్డు పట్టుకుని దాన్ని కెమెరా వైపు విసురుతూ, ఒళ్లు గగుర్పొడిచేలా డైలాగ్స్ చెప్పారు,

"కిత్నే ఖూన్ కియే యే యాద్ నహీ. అచ్చే లోగ్ థే యా బురే కభీ పూచా నహీ. బస్ ఉన్కీ ఆంఖో మే ఎహ్‌సాస్ దేఖా, యే ఉన్కీ ఆఖ్రీ సాన్స్ హై. ఔర్ మై ఉస్కీ వజహ్. హజార్ జుర్మ్, 100...