భారతదేశం, డిసెంబర్ 2 -- దక్షిణాదిలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళం నటుడు అయినా కూడా తెలుగు, తమిళంలోనూ మంచి పేరు సంపాదించాడు. మొత్తంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉన్నాడు. 2018లో 'కార్వాన్' (Karwaan) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతడు.. అక్కడ తనకు ఎదురైన వింత పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ 2025'లో పాల్గొన్న దుల్కర్.. అక్కడ సెట్స్ లో గౌరవం దక్కించుకోవడానికి తాను ఏం చేయాల్సి వచ్చిందో వివరించాడు.

హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు తనను, తన సిబ్బందిని అక్కడ ఎవరూ పట్టించుకునేవారు కాదని దుల్కర్ చెప్పాడు. "నేను హిందీ సినిమాలు చేసినప్పుడు, సెట్‌లో నన్ను, నా ఇద్దరు మనుషుల్ని అటూ ఇటూ నెట్టేసేవారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు దొరికేవి కావు. మానిటర్ చూడటాని...