భారతదేశం, ఏప్రిల్ 25 -- ప్రస్తుతం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు వచ్చాయి. అందరు విద్యార్థులు ఆనందంగా ఇళ్లకు వెళ్తున్నారు. కానీ అమ్మా నాన్నలు, ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో.. ఇలాంటి చిన్నారులంతా బాలసదన్‌లకు వెళ్తున్నారు.

హాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్...