భారతదేశం, అక్టోబర్ 14 -- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని.. బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓపిక పట్టాలని, అవసరం అయినప్పుడు పదవి వస్తుందని బాలయ్య చెప్పారు.

పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డి బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. బీటీ రోడ్డు ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

హిందూపురం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అన్ని కష్టాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినప్పటికీ బాలయ్య బాబుకు మంత్రి ప...