భారతదేశం, డిసెంబర్ 3 -- తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా రాణిస్తున్నాడు ఈ హీరో. అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఆ తర్వాత ది వారియర్ మూవీలో కూడా ప్రతినాయకుడిగా అలరించాడు.

ఇప్పుడు మరోసారి ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన సినిమా అఖండ 2 తాండవం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ యాక్ట్ చేసింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషించింది.

డిసెంబర్ 5న థియేటర్లలో అఖండ 2 విడుదల అవుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది పినిశెట్టి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇంట్రెస్ట...