భారతదేశం, డిసెంబర్ 13 -- నందమూరి బాలకృష్ణకు బాక్సాఫీస్ వద్ద ఆలస్యంగానైనా ఘన స్వాగతం లభించింది. వారం రోజులు వాయిదా పడిన ఆయన డివోషనల్ యాక్షన్ ఎపిక్ 'అఖండ 2: తాండవం' చిత్రం ఎట్టకేలకు శుక్రవారం (డిసెంబర్ 12) థియేటర్లలో విడుదలైంది.

అఖండ 2 తాండవం సినిమా తొలి రోజునే (గురువారం ప్రివ్యూలతో కలిపి) అసాధారణ రీతిలో కలెక్షన్స్ రాబట్టి సినీ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం 'అఖండ 2' చిత్రానికి గురువారం (డిసెంబర్ 11) ప్రివ్యూల ద్వారానే రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో నమోదైలన వసూల్లు మాత్రమే. ఇక విడుదలైన శుక్రవారం (డిసెంబర్ 12) అఖండ 2 తాండవం సినిమాకు ఇండియాలో రూ. 22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ. 21.95 కోట్లు ఉండగా హిందీ బెల్ట్ ద్వారా రూ....