Hyderabad, జూన్ 10 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంగళవారం (జూన్ 10) తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు అఖండ 2 మూవీ షూటింగ్ తోపాటు తన గురించి తాను చెప్పుకున్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.

మరికొద్ది నెలల్లో అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. అవును నాకు పొగరుంది అని అతడు అనడం గమనార్హం. తన పుట్టన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడాడు. "వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చాం. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ హిట్ అయ్యాయి.

రేపు రాబోయే అఖండ తాండవం కూడా.. నేను ఒక సందర్భంలో చెప్పాను ఇక నుంచే బాలయ్య అంటే ఏంటో చూపిస్తానని అన్నాను. వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన తర్వాత ఇక చూపి...