భారతదేశం, డిసెంబర్ 7 -- చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా 'నారి నారి నడుమ మురారి'. ఇదివరకే బైకర్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన శర్వానంద్ మరో మూవీతో రెడీ అయ్యాడు.

నారి నారి నడుమ మురారి సినిమాకు సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇది ఫెస్టివల్‌కి పర్‌ఫెక్ట్ మూవీగా అభివర్ణించారు.

అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నారి నారి నడుమ మురారి సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్, ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించారు.

బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ టైటిల్ నారి నారి నడుమ మురారితో వస్త...