భారతదేశం, డిసెంబర్ 4 -- బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీ ప్రీమియర్ షోల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. గురువారం (డిసెంబర్ 4) ఉండాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ షోలు ఉండనున్నాయి.

అఖండ 2 ప్రీమియర్ షోల కోసం గురువారం (డిసెంబర్ 4) ఉదయం నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే సాయంత్రం నిర్మాణ సంస్థ ఈ షోలను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో వాళ్లు ఉసూరుమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఇండియా వ్యాప్తంగా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు 14 రీల్స్ ప్లస్ చెప్పింది.

"సాంకేతిక కారణాల వల్ల ఇవాళ ఇండియాలో ఉండాల్సిన అఖండ 2 ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాం. మా శక్తి మేర ప్రయత్నించాం. కానీ కొన్ని మన నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి ...