భారతదేశం, డిసెంబర్ 2 -- నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవేటెడ్ మూవీ అఖండ 2. నాలుగేళ్ల కిందట వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వరుసగా నాలుగో హిట్ కోసం బాలయ్య చూస్తున్నాడు. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 2) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ కు ముందు రోజు అంటే గురువారం (డిసెంబర్ 4) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోల కోసం టికెట్ల ధరను రూ.600 గా నిర్ణయించారు.

అన్ని థియేటర్లలోనూ ఇదే ధర ఉంటుంది. ఇక మూవీ రిలీజయ్యే డిసెంబర్ 5 నుంచి తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ ప...