భారతదేశం, నవంబర్ 14 -- గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. తాజాగా శుక్రవారం (నవంబర్ 14) ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం రిలీజైంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

అఖండ 2 మూవీ నుంచి ది తాండవం అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ లిరికల్ వీడియో బాలయ్య విశ్వరూపంతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముంబైలోని జుహులో మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

బాలీవుడ్ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఈ పాట పాడటం విశేషం. శివుడి తాండవం గురించి పవర్‌ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగిపోయింది. ఇందులో అఘోరా లుక్ లో బాలయ్య నటవిశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడ...