Andhrapradesh, సెప్టెంబర్ 13 -- ఏపీలో కొత్త బార్ పాలసీకి స్పందన కొరవడటంతో మరోసారి బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించింది. మొత్తం 428 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీచేయగా పది రోజుల్లో కేవలం.. 11 బార్లకే నాలుగు చొప్పున దరఖాస్తులు అందాయి. ఇంకా 417 బార్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది.

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవటంతో ఎక్సైజ్ శాఖ.. మరోసారి నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించింది. 18వ తేదీన లాటరీ విధానంలో లైసెన్సులను మంజూరు చేయనుంది.

మొదటి విడత కింద మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించిన తర్వాత.. 412 బార్లకు దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 428 బార్లకు ఈ నెల 3న రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేశారు. సమయం కూడా బాగానే ఇచ్చారు. అయినప్...