భారతదేశం, జూలై 30 -- బార్బీ బొమ్మలకు ప్రాణం పోసిన మారియో పాగ్లినో, జియాని గ్రోస్సి కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులు, బార్బీ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కళతో బొమ్మల ప్రపంచానికి కొత్త రంగులద్దిన ఈ ఇద్దరు గొప్ప డిజైనర్ల మరణం పట్ల బార్బీ బృందం కన్నీటి నివాళులర్పించింది. "వారు ఎంతో అంకితభావంతో పనిచేసేవారు, అపారమైన ప్రతిభ ఉన్నవారు. చిన్నప్పటి నుంచీ బొమ్మలను సేకరించేవారు కూడా" అంటూ బార్బీ బృందం వారిని గుర్తుచేసుకుంది.

బార్బీ డిజైనర్లుగా ప్రపంచమంతా గుర్తింపు పొందిన మారియో పాగ్లినో, జియాని గ్రోస్సి, చాలాకాలంగా మంచి స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కూడా. జూలై 27న ఇటలీలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం A4 ట్యూరిన్-మిలన్ హైవేపై జరిగింది. 82 ఏళ్ల ఓ వ...