భారతదేశం, జనవరి 28 -- మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 'బారామతి దాదా', ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా సాంకేతిక లోపంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే ఆయన ముంబైలో బిజీగా గడిపారు. మంగళవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన 'మహారాష్ట్ర కేబినెట్ కమిటీ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' సమావేశానికి అజిత్ పవార్ హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన, మరుసటి రోజే తన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది.

1991 నుంచి అజిత్ పవార్‌కు బారామతి నియోజకవర్గంతో విడదీ...